విద్యా వైజ్ఞానిక మేళా ప్రారంభం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో విద్యా వైజ్ఞానిక మేళాను మున్సిపల్‌ కమిషనర్‌ రాజు ప్రారంభించారు. విద్యార్థులు పలు స్టాళ్లను ఏర్పాటు చేయగా వివిధ పాఠశాలల విద్యార్థులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ దామోదరరావు, మండల విద్యాధికారి దేవాజీ తదితరులు పాల్గొన్నారు.