విద్యుత్తు షార్టు సర్క్యూట్‌ వల్ల బాలుడు మృతి

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో మంగళవారం జరిగిన విద్యుదాఘాతంలో తోటవార్‌ అమూల్‌ (8) మృతి చెందాడు. నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలం తడుగూర్‌ గ్రామానికి చెందిన రేణుక స్థానికంగా కోళ్లఫారంలో కూలీ పని చేస్తుంటుంది. మంగళవారం అమూల్‌ కోళ్లఫారంలోని కరెంటు మోటారును తాకాడు. విద్యుత్తు షార్టు సర్య్కూట్‌ జరగతుండటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.