విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించిన రైతులు
కరీంనగర్: గంగాధర మండలంలోని 4గ్రామాల్లో రెండు నెలల క్రింద కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ పార్మర్లకు మరమత్తులు చేపట్టాలని రైతులు గంగాధర విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నాగిరెడ్డిపూర్, నర్శింహులపల్లి, మల్లాపూర్, ఉప్పరమల్యాల గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి 2నెలలు గడిచిన మరమత్తులు చేపట్టకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారు.