విద్యుత్ ఉపకేంద్రంపై దాడి
విద్యుత్ కోతలకు నిరసనగా మల్లాపూర్ విద్యుత్ ఉపకేంద్రంపై రైతులు దాడికి దిగారు. అప్రకటితో కోతలను ఎత్తివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.