విద్యుత్‌ ఉప కేంద్రం ముట్టడి

నిజామాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ  నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇశాయిపేట రైతులు రోడ్డెక్కారు. సుమారు 200 మంది రైతులు స్థానికంగా ఉన్న విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటలపాటు సరఫరాను పునరుద్ధరిస్తామని రాతపూర్వంకంగా హామీ ఇచ్చేంతవరకూ కదిలేది లేదని ఏఈ పాండురంగారావు, లైన్‌మెన్‌ సునీల్‌ను రైతులు నిర్బంధించారు.