విద్యుత్‌ కార్మికుల ఆందోళన

విజయవాడ,ఆగస్టు29(జ‌నం సాక్షి): విజయవాడ గుణదల విద్యుత్‌ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు చలో విద్యుత్‌ సోదా పేరిట ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులలో ఒక కార్మికుడు సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. పోలీసులు రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాయకులలో, కార్మికులలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ.గఫూర్‌, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి ఓబులేసు, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, తదితరులు పాల్గన్నారు.

 

తాజావార్తలు