విద్యుత్ కోతలకు నిరసనగా తెదేపా రాస్తారోకో
కాగజ్‌నగర్ : విద్యుత్ కోతలు ఎత్తివేసి రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగం మాట్లాడుతూ సర్‌ఛార్జీలు పెంపు యోచనలో ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.