విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతులు మృతి

పెద్దపల్లి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : పెద్దపల్లి మండలం నిట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులపై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో రైతు ఓదేలు, కూలీ వైకుంఠం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓదేలు, వైకుంఠం మృతి చెందడాన్ని స్థానికులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.