విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారో అగ్నిప్రమాదం
నల్లగొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం చెంగిచెర్ల సబ్‌స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. రూ. కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పలు గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.