విద్యుత్ ను ప్రైవేటీకరణ చేయడమంటే దేశ ప్రజలకు ద్రోహం చేయడమే
విద్యుత్ ప్రైవేటీకరణ దేశ ప్రజలకు చేటు
దేశాభివృద్ధికి విద్యుత్ ప్రైవేటీకరణ గొడ్డలిపెట్టు
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులతో పాటు దేశంలోని ప్రగతిశీల శక్తులు ఏకం కావాలి
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట ( జనంసాక్షి ): విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడమంటే అది దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు.విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.విద్యుత్ రంగం ప్రైవేటీకరణతో దేశ ప్రజలకు చేటు అని అన్నారు.విద్యుత్ సంస్కరణలు దేశ ప్రజలకు ఉరి తాళ్లుగా మారబోతున్నాయని, సంస్కరణల పేరుతో ప్రజల జేబులు కొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ కొన్నాళ్ల క్రితం చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయని అన్నారు.ప్రైవేట్ వ్యక్తుల చేతిలో , సంస్థల చేతికో డిస్కమ్ లు వెళితే నిత్యావసర ధరల పెరగుదలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందన్నారు.విద్యుత్ సంస్కరణలు దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు అని అన్నారు.దీని ఎఫెక్ట్ దేశంలోని రైతాంగం , గృహ వినియోగదారులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.దీనికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు, దేశంలోని ప్రగతిశీల సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
Attachments area