విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి దుర్మరణం

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (10): విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మున్ననూరులో చోటుచేసుకుంది ఎస్సై నవీద్ కథనం మేరకు .. వంగూరి లక్ష్మయ్య (62)మంగళవారం ఇంటి నుండి గ్రామ సమీపంలోని తాండాకు వెళ్ళాడు సాయంత్రం పొద్దుపోయాక తిరుగు ప్రయాణమయ్యాడు పొలాల గుండా ఇంటికి వస్తున్న గా అడవిపందుల నుండి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు గమనించక విద్యుత్ వైరు కు తగలడంతోవిద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతట వెతికారు బుధవారం గ్రామ శివారులోని రాళ్ల చెరువులో శవమై కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు పొలం యజమాని తన పై కేసు అవుతుందని భయంతో మృతదేహాన్నితీసుకెళ్లి చెరువులో వేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి కుమారుడు శ్రీను పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు