విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
రేగొండ: వరంగల్ జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గేదెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వర్షాల కారణంగా గ్రామంలో విద్యుత్ తీగలు తెగికిందపడ్డాయి. సోమవారం ఉదయం తీగలపై నుంచి దాటి ఓ గేదె ప్రమాదానికి గురైంది. అయితే గేదెను రక్షించేందుకు యత్నించిన తుమ్మలపల్లి బాపురావు(30), మరిగిద్ద రాజేశ్వరారవు (42) రైతులు ఇద్దరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గేదె కూడా మృతి చెందింది.