విద్యుదాఘాతంతో యువతి మృతి
సంగారెడ్డి, జూలై 26 : ఉతికిన బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఒ యువతి మృతి చెందింది. వర్గల్ పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వర్గల్ మండలం పరిధి పాతూర్ గ్రామానికి చెందిన రేణుక అనే యువతి గురువారం ఉదయం బట్టలు ఉతికి ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడింది. గాయపడిన యువతిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది.