విద్యుదాఘాతంతో రైతు మృతి
శాంతినగర్: సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో పంగ దుర్గయ్య అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మియాపూర్ గ్రామంలో ఐదెకరాల్లో పంటసాగు చేస్తున్న దుర్గయ్య ఈరోజు ఉదయం 10గంటలకు పొలానికి నీరు పెట్టేందుకు పంపుసెట్టు వద్దకు వెళ్లాడు. స్విచ్‌ఆన్ చేస్తున్న సమయంలో విద్యుత్తు సరఫరా కావడంతో ఆయన మృతిచెందాడు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.