విద్యుదాఘాతంలో అసిస్టెంట్ హెల్పర్‌కు తీవ్రగాయాలు
ఎల్లరెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని గొల్లపల్లిలో విద్యుత్తుశాఖలో అసిస్టెంట్ హెల్పర్‌గా పనిచేస్తున్న బాలయ్య విద్యుదాఘాతంతో సోమవారం తీవ్రగాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.