విద్యుదాఘాతానికి బలైన యువకుడు
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శనివారం మహేష్(25) అనే యువ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. వ్యవసాయ బావి దగ్గర మంచినీరు తాగుతుండగా పక్కనే ఉన్న కరెంటు తీగ అనుకోకుండా తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది.