విద్యుదుత్పత్తి దశలోకి ఎన్టీపీసీ మూడో యూనిట్
జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీలోని 200 మెగావాట్ల 3వ యూనిట్‌ను సోమవారం తెల్లవారుజామున విద్యుత్తు ఉత్పత్తి దశలోకి తీసుకు వచ్చారు. బాయిలర్‌లో ఏర్పడిన ట్యూబ్ లీకేజీతో శనివారం తెల్లవారుజామున యూనిట్ నిలిచిపోయింది. రెండు రోజులు మరమ్మతు చేసిన అధికార యంత్రాంగం తిరిగి ఉత్పత్తి దశలోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం రామగుండం ఎన్టీపీసీలో 2565 మెగావాట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.