విద్య అభివృద్ధికి తోడ్పడేందుకు జిల్లాను ఎంపిక చేయడం గర్వకారణం

 జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో.జనం సాక్షి
జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చి విధ్యార్ధులకు అన్నీ వసతులను కల్పించేందుకు పీపుల్ ఫర్ ఇండియా ఆర్గనైజేషన్ వారు మన జిల్లాను ఎంపిక చేయడం చాలా సంతోషంగా  ఉందని జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి అన్నారు.
బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ లు , కస్తూర్భా పాఠశాల స్పెషల్ ఆఫీసర్లు   , ప్రిన్సిపల్స్ తో పాటు పీపుల్ ఫర్ ఇండియా ఆర్గనైజేషన్ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీపుల్ ఫర్ ఇండియా సంస్థ వారు మన జిల్లాలోని 192 పాఠశాలలకు అవసరమైన వసతులను కల్పించేందుకు ముందుకు వచ్చారని వారు కల్పించే సహాయానికి యాదాద్రి జిల్లా విధ్యార్ధులకు మంచి ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ అన్నారు. ఒక అమెరికా ఎన్ జి ఓ  సంస్థ మన జిల్లాలోని పాఠశాలను ఎంపిక చేసుకొని వాటిని అభివృద్ది పరిచేందుకు సహాయ సహకారాలు అందివడం హర్షించ దగిన విషయమని వారు అందించే రివార్డులను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు కళాశాలల  ప్రభానోపాధ్యాయులు  మండల విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తదుపరి విద్య ప్రమాణాలు వంద కు వంద శాతం మెరుగు కావాలని ఒకరు హృదయపూర్వకంగా రివార్డు ఇచ్చినపుడు దాని ఫలితాలు వారికి కనిపించేందుకు కృషి చేయాలని అప్పుడే ఇతరాలు కూడ కళాశాల అవసరాలు తీర్చేందుకు ముందుకు వస్తారని కలెక్టర్ అన్నారు. విధ్యార్ధులను తీర్చి దిద్ది ఒక మంచి పౌరునిగా , తన కాళ్ల  పై తాను నిలబడి, తన బావి జీవితం సంతోశంగా గడిపేందుకు గురువుల పాత్ర చాలా విసిస్టమైనదని , అందుకే గురువులను గొప్పవారుగా బావించాలని కలెక్టర్ అన్నారు.
స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ పాఠశాల విద్య చాలా విలువైనదని ,పీపుల్ ఫర్ ఇండియా వారు కల్పించే రివార్డు సద్వినియోగం చేసుకొని పాఠశాలకు అవసరమున్న సదుపాయాలను మెరుగుపర్చుకోవాలని దీని కొరకు ప్రాధానోపాధ్యాయులు, ఎం‌ఈ‌ఓ లు కృషి చేయాలని అన్నారు.
సమావేశంలో పీపుల్ ఫర్ ఇండియా సభ్యులు పబ్బతి సూరజ్, గర్రెపల్లి అరవింద్, సుమన్, మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఒక మంచి కార్యక్రమాని తీసుకరావడం జరిగిందని దీని ద్వారా రాష్ట్రంలోని ఒక్కొక జిల్లాలో కొన్ని పాఠశాలలు ఎంపిక చేస్తున్నట్లు అందులో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని 192 పాఠశాలలు తమ పరిశీలనలో ఉన్నాయని , ఆ పాఠశాలలలో  మౌలిఖ వసతులు, విధ్యార్ధులకు అవసరమయ్యే ఇతర వస్తువులను సమకూర్చేందుకు నిర్ణయించిన్నట్లు వారు తెలిపారు . పాఠశాల కాంపౌండ్ వాల్స్, కంప్యూటర్స్, ప్రింటర్స్, స్కానర్స్, స్కూల్ బ్యాగ్ లు ఇంకా పాఠశాలకు అవసరమయ్యే వస్తువులను సమకూరుస్తున్నట్లు వారు తెలిపారు. అమెరికా వెళ్ళిన చాలా మంది జన్మ స్థలమైన భారత దేశంలో కొన్ని అవసరాలను సమకూర్చేందుకు ముందుకు వస్తున్నారని వారి అందరి సహకార ప్రోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తున్నట్లు, ఇప్పటివరకు 1000 మంది వాలంటీర్లు వివిధ దశలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.  లీడ్  విత్  వేల్యూ  ప్రోగ్రామ్  ద్వారా విధ్యార్ధులకు  విలువలతో కూడిన విద్యను అందించాలని, నాయకత్వ లక్షణాలను పెంపోదించాలని, జాతీయా స్థాయి నాయకుల యొక్క జీవిత చరిత్రలు, వారు చేసిన సేవలను , విద్యార్ధులకు తెలియజేస్తూ వారిని ఉతేజపరుస్తూ విధ్యార్ధులు స్వతహాగా నాయకుల యొక్క జీవిత చరిత్రను వారు చేసిన సేవలను ఎటువంటి బయబ్రాంతులకు  గురికాకుండా స్పష్టంగా వ్యక్త పరిచే విడియోలను తీసి సంవత్సర కాలంలో 10 విడియోలను పీపుల్ ఫర్ ఇండియా సైట్ లో అప్లోడ్ చేసిన వారికి సంస్థ నుండి రివార్డును అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
పీపుల్ ఫర్ ఇండియా ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తున కార్యక్రమాలను పిట్  ద్వారా , జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ , డి ఈ ఓ., సమావేశానికి హాజరైన హెడ్ మాస్టర్లకు వివరించారు.
డి ఈ ఓ  నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్య వ్యక్తి వికాసానికి మూలం అని , విద్యతోటే సమాజం గౌరవిస్తునదని, విధ్యార్ధి దశ నుండే  పిల్లలు గురువుల మాటలు విని తమకు తాము సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు.

తాజావార్తలు