విద్య వ్యవస్థని బలోపేతం చేయాలి… నోముల భగత్
(నందికొండ),జూలై 14,(జనం సాక్షి); నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా నాగార్జునసాగర్ లో డిగ్రీ కళాశాల,ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల కోసం పైలాన్ కాలనీలోని పాత బీఈడీ కళాశాల స్థలాన్ని,హిల్ కాలనీలోని ఎస్సీ కార్యాలయం స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారు లతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఐదు గురుకుల పాఠశాలను నూతనంగా నిర్మించాలనే లక్ష్యానికి అనుగుణంగా నాగార్జునసాగర్ లో నిర్మించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ అనూష శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ,నందికొండ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి,నందికొండ మున్సిపాలిటీ ప్రదాన కార్యదర్శి భూష రాజుల కృష్ణయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయపురి నార్త్ డివిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు,స్థానిక ఎస్సై బి రాంబాబు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.