విద్య హక్కు చట్టం అమలు చేయాలి

*కార్పొరేట్, ప్రవైట్ స్కూల్లో ఫీజులు తగ్గించాలి
* రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తలు
. జనం సాక్షి
ఫీజు నియంత్ర చట్టం తెచ్చి విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని, కార్పొరేట్ ప్రైవేటు స్కూలు ఫీజులు తగ్గించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పట్నం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, టిపిఏ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు ప్రోత్సహించడం వలన విద్యా వ్యాపారంగ మారిందని ఆరోపించారు. పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాల్సిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వాటి పేరుతో వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు వేలాది రూపాయలు ఫీజులు వాళ్లే నిర్ణయించి వసూలు చేయడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోరావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తరగతుల వారీగా ఫీజు నిర్ణయించి అట్టి ఫీజులను నోటీసు బోర్డుపై ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలో డ్రస్సులు, పుస్తకాలు అమ్మే విధానాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు. కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేసే కార్పొరేట్ సంస్థలపై  చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఫీజులు నియంత్రణ కోసం ప్రత్యేక రెగ్యులేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని దానిని జిల్లాలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 20 నుంచి 50% ఫీజులు పెంచుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలన్నారు. ఒకే పేరుతో వందలాది బ్రాంచీలు పెడుతూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయాలన్నారు. 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలన్నారు. ఇరుకైన గదుల్లో సేఫ్టీ లేని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీటి అమలు కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈనెల 13న మండల కేంద్రాల్లో ఎంఈఓ లకు కలిసి వినతి పత్రాలు అందజేయాలని,15న హైదరాబాదులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, వస్కుల మట్టయ్య, బంటు వెంకటేశ్వర్లు, యూటీఫ్ రాష్ట్ర నాయకులు నాగమణి, బక్క శ్రీని

తాజావార్తలు