విధులు బహిష్కరించి హాస్పిటల్ ముందు నిరసన చేసిన కార్మికులు
హాస్పిటల్ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు లేకుండా, ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చెయ్యడం సరైంది కాదని, ప్రతి నెలా జీతాలు ఇవ్వకుంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, నెలల తరబడి జీతాలు ఇవ్వకుంటే కార్మికులు బ్రతికేదెలా అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ అన్నారు. జీతాలు రేపు,మాపు అంటూ కాలం వెల్లదీస్తున్న వైఖరికి నిరసనగా ఈ రోజు కార్మికులు విధులు బహిష్కరించి సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ నేటితో మూడు నెలలు గడుస్తున్నా జీతాలు రాకపోవడం సరైనది కాదని, తక్షణమే వేతనాలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. స్పందించిన సూపరిండెంట్ డాక్టర్ శేషు ధర్నా వద్దకు వచ్చి జీతాలు వెంటనే, రేపటి వరకు కాంట్రాక్టర్ జీతాలు వేస్తారని హామీ ఇచ్చి విధులకు హాజరు కావాలని అన్నారు. డాక్టర్ శేషు హామీ మేరకు కార్మికులు విధులకు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు హాస్పిటల్ యూనియన్ అధ్యక్షులు బండి సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఎలీషా, నాయకులు సుమలత, కృష్ణ, సూపర్వైజర్ గౌస్, తరులు పాల్గొన్నారు.