వినయ్ కుమార్ బంతికి గంభీర్ బ్యాట్ రెండు ముక్కలైంది: యువీ ట్వీట్

hu0hsxd3
కోల్‌కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ బౌలర్ వినయ్ కుమార్ వేసిన బంతికి కోల్‌కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ం గంభీర్ బ్యాట్ విరిగి పోయింది. ఈ సంఘటనతో స్టేడియంలో ఉన్న అభిమానులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ సంఘటనపై యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలతో పాటు క్రికెట్ అభిమానులు ట్విట్టర్‌లో జోక్స్ పేల్చారు. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబైపై కోల్‌కత్తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వినయ్ కుమార్ బంతికి గంభీర్ బ్యాట్ రెండు ముక్కలైంది: యువీ ట్వ బ్యాటింగ్‌ను ప్రారంభించనప్పటి నుంచి కెప్టెన్ గౌతం గంభీర్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో వినయ్ కుమార్ వేసిన బంతి గంబీర్ బ్యాట్‌కు తలగలగానే రెండుగా విరిగిపోయింది. ఈ సంఘటనపై అభిమానులు ట్విట్టర్‌లో ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్‌కు జతగా యువరాజ్ సింగ్ కూడా కలవడం విశేషం.

బ్యాట్ మార్చిన అనంతరం గంభీర్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీని పూర్తి చేసి, జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు సాధించింది. 169 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన గంభీర్ సేన ఏ మాత్రం బెదరకుండా 9 బంతులుండగానే అలవోకగా చేధించింది.