వినాయక్ రెడ్డిని సన్మానించిన న్యాయవాదులు…
.
నిర్మల్ బ్యూరో, ఆగస్టు25,జనంసాక్షి,,, ప్రముఖ న్యాయవాది కొమ్ముల వినాయక్ రెడ్డి ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా పలువురు న్యాయవాదులు వినాయక్ రెడ్డిని జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కలిసి శుభాభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు తన షాయా శక్తుల కృషి చేస్తానని, పార్టీ కి సైనికుల్లా పని చేస్తానని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వం లో గ్రామస్థాయి లో బలోపేతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వి. శ్యాంసుందర్ రెడ్డి, నూనె గంగాధర్, వి.వి. రమణ రావు, నర్సారెడ్డి, కొమ్మోజి రమణ, వి.మధుకర్, ఎస్. రాజు తదితరులు పాల్గొన్నారు.
