వినాయక ఉత్సవాలు ప్రశాంతమైన వాతావ రణంలో జరుపుకోవాలి.
వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి.
తాండూరు ఆగస్టు 29 (జనం సాక్షి) వినాయక ఉత్సవాలు కలిసిమెలిసి సోదర భావంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు.
సోమవారం తాండూరు పట్టణం తులసి గార్డెన్ లో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అన్ని కుల మతాల పెద్దలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులతో కలిసి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ముఖ్య అతిథి హాజరై మాట్లాడుతూ జిల్లాలోని అన్నీ మతాల ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని అన్నారు. శాంతికి మారుపేరుగా ఉన్న తాండూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పోలీసులకు సహకరిస్తూ పండుగలను జరుపుకోవాలని సూచించారు సోషల్ మీడియా లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేట టువంటి ఫోటో లు, వీడియోలు ,మెసేజ్ లు ఫార్వార్డ్, షేర్ చేయరాదని తెలిపారు. ఇతర మత విశ్వాసాలపై వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్నారు. వినాయక మండపలను మరియు నిమార్జన ప్రదేశాలను సందర్శించడం జరిగిందని. వినాయక మండపలకు, నిమర్జనానికి సంబందించి రూపొందించినా రూట్ మ్యాప్ ను సిబ్బందితో కలిసి పరిశీలించారు. వినాయక ఉత్సవాలను మరియు నిమజ్జన ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తగా పండుగలు చేసుకోవాలి, కుల మతాలకు అతీతంగా పండుగలను ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలని జిల్లా ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని పండుగలను ప్రశాంతవాతవరణంలో జరుపుకుని పోలీస్ అధికారులకు సహకరించాలి కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు మత పెద్దలు వినాయక మండపాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు