వినాయక మండపాల వద్ద కుంకుమ పూజలు … ప్రత్యేక పూజలు …. అన్నదాన కార్యక్రమాలు ….
జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 3:
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల వినాయకుల మంటపాల వద్ద నాలుగవ రోజు శనివారం మహిళలు ప్రత్యేక పూజలతో పాటు కుంకుమ పూజలు అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుర్తి అంగడి బజార్ యువసేన యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథునికి మహిళలు ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పలు రకాల నైవేద్యాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గల్లీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజలు మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం రాత్రి గునుకుల పల్లె గ్రామంలో కుంకుమ పూజలు నిర్వహించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి మండపం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. మండలంలో 17 గ్రామాలకు గాను 160 విగ్రహాలను మండలంలో పెట్టినట్లుగా ఎస్సై దాస సుధాకర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిరోజు గ్రామాల వారిగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ వినాయక మండపాల వద్ద నిర్వాహకులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు.ఇందుర్తి అంగడి బజార్ లో యువసేన యూత్ అధ్యక్షుడు,రెడ్డి సంఘం అధ్యక్షుడు గాదె రఘునాథ్ రెడ్డి తదతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.