విప్ రేగాను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై సంతోష్.
బూర్గంపహాడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ని నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి. సంతోష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.