విమర్శలతో ఎదురుదాడి చేయడం కాదు
నీతి ఆయోగ్‌లో బాబు ప్రస్తావించిన విషయాలపై చర్చించాలి
ఆనాటి హావిూలను అమలు చేసి సత్తా చాటాలి: కళా
అమరావతి,జూన్18(జనం సాక్షి): నీతి ఆయోగ్ భేటీలలో సిఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన అంశాలపై స్పస్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైన, ప్రధాని మోడీపైన ఉందని టిడిపి వ్యాఖ్యనించింది.ఆనాటి హావిూలను అమలు చేఇ నిబద్దత నిరూపించుకోవాలని ఎపి టిడిపి అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావ్ అన్నారు. వీటిని పక్కదాని పట్టించేలా నాలుగేళ్లు గడిపారని అన్నారు. అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలోనూ పదేళ్లు ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది. అయితే… 14వ ఆర్థిక సంఘం సిఫారసులను నెపంగా చూపించి హోదా ఇవ్వలేమని ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈ వాగ్దానాన్ని కేంద్రం ఉల్లంఘించిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు నీతి ఆయోగ్‌లో వివరించారన్నారు. నిజానికి రాష్ట్ర విభజనను సీమాంధ్రులు కోరుకోలేదనిఅన్నారు. తమకు జరిగిన నష్టం పట్ల ప్రజలు ఎంతో భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. తమను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని వారు భావిస్తున్నారని తెలిపారు. అప్పటి ప్రధాన మంత్రి ఇచ్చిన హావిూలకు, కాగ్ నివేదికలకు, సుప్రీం కోర్టు సలహాలకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని చంద్రబాబు చేసిన ప్రనకటనపై స్పందించకుండా విమర్శలతో ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున… భూసేకరణ, పునరావాసం నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించాలని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రివర్గం తీర్మానం కూడా చేసిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుపై రాష్ట్రం పెట్టిన ఖర్చును వెంటనే తిరిగి చెల్లించాలని కోరారు. అమరావతి దేశానికే తలమానికం కాగలిగిన సరికొత్త నగరమని దీనికోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.. దీని నిర్మాణానికి 20 ఏళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరమని చంద్రబాబు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని 27 వేల మంది రైతులు రూ. 50 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన భూమిని సవిూకరణలో అప్పజెప్పగా… కేంద్రం రూ.1500 కోట్లతో సరిపెట్టిందని నిరసించారు. వెనుకబడిన ప్రాంతాలను ఆదుకునే విషయంలోనూ కేంద్రం ఏపీ పట్ల వివక్ష చూపిందని చంద్రబాబు విమర్శించారు. బుందేల్‌ఖండ్‌కు రూ.4వేల చొప్పున తలసరి సహాయం ప్రకటించిన కేంద్రం… ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు రూ.408 మాత్రమే కేటాయించింది. ఇటీవల రూ.350 కోట్లు ఖాతాలో జమ చేసి… అసాధారణమైన రీతిలో, సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది అని వెల్లడించారు. రాష్ట్రానికి రూ. 16078.76 కోట్ల మేరకు రెవెన్యూ లోటు ఉందని కాగ్ నిర్ధారించిందని, ఈ మొత్తాన్ని మొదటి సంవత్సరమే ఆర్థిక బిల్లులో చేర్చాల్సింది పోయి కేంద్రం ఏకపక్షంగా కోత విధించిందన్నారు. రెవెన్యూ లోటును కేవలం రూ. 4117. 89 కోట్లకు తగ్గించిందని, ఈ మొత్తాన్ని కూడా పూర్తిగా విడుదల చేయలేదని తెలిపారు. ఇవన్‌ఈన నేరుగానే సిఎం చంద్రబాబు ప్రశ్నిస్తే వాటికి సమాధానం ఇవ్వకుండా బాబుపై బజిఎపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణమని అన్నారు. రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఏపీ శాసన సభా సీట్ల పెంపు, పన్ను వ్యత్యాసాల సవరణ, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, వైజాగ్ – చెన్నై పారిశ్రామిక సమాహారం, విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, దుగరాజుపట్నం రేవు, అమరావతికి ర్యాపిడ్ రైలు రహదారి అనుసంధానం, గ్రేహౌండ్ శిక్షణా కేంద్రం మొదలైన అంశాలు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వీటిని అమలు చేయరా అని కళా ప్రశ్నించారు.