విమానం ఇంజిన్‌లో మంటలు
ఆటగాళ్లు సురక్షితం
మాస్కో, జూన్19(జనం సాక్షి) : సౌదీ అరేబియా ఫుడ్‌బాల్ ఆటగాళ్లకు తృటిలో ప్రమాదం తప్పింది. రష్యాలో ఫిఫా ప్రపంచకప్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. దేశంలోని వేర్వేరు నగరాల్లో ఉన్న వేదికలు పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణించాల్సి ఉంటుంది. తాజాగా సౌదీ అరేబియా ఆటగాళ్లు బుధవారం ఉరుగ్వేతో మ్యాచ్ కోసం సోమవారం అర్ధరాత్రి విమానంలో రోస్తావ్ ఆన్ డాన్ చేరుకున్నారు. అయితే రోస్తావ్ ఎయిర్‌పోర్టులో ఆటగాళ్ల విమానం దిగుతున్న సమయంలో ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అందరూ ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటగాళ్లంతా క్షేమంగా ¬టల్‌కు చేరుకున్నారు. ‘సెయింట్‌పీటర్స్ బర్గ్ నుంచి రోస్తావ్‌కు రోషియా ఎయిర్‌బస్ ఏ319లో సౌదీ ఆటగాళ్లు ప్రయాణించారు. ఈ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. పక్షి తాకడంతోనే ఇలా జరిగినట్లు సమాచారం. దీనిపై విచారణ చేపడతాం’ అని ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపారు. మేము ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. థాంక్ గాడ్. అందరం క్షేమంగా ఉన్నాం. ¬టల్‌కు చేరుకున్నాం’ అని సౌదీ అరేబియా జట్టు సార్థి ఓసామా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలిపాడు.