విమోచన దినోత్సవాన్ని సమైక్య దినోత్సవంగా జరపడం ఏంటి..?
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 17 : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ సమైక్య దినంగా మార్చడం ఏమిటని..? బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ ప్రశ్నించారు. విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శనివారం బిజెపి పట్టణ అధ్యక్షులు కాటం సురేందర్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బూరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. కెసిఆర్ నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ సమైక్య దినోత్సవంగా మార్చిన ఘనత కెసిఆర్ ది అని దుయ్యబట్టారు. ఎంఐఎంకు భయపడి విమోచనాన్ని సమైక్యంగా మార్చిన నిరంకుశ సీఎంగా కేసీఆర్ తెలంగాణ చరిత్రలో మిగిలిపోతాడన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పేరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం గర్వంగా జరుపుతున్న చరిత్ర బిజెపిదని గుర్తు చేశారు. బిజెపి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం చూసి కేసిఆర్ కు భయం పుట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య దినంగా జరపడం కేసీఆర్ కి చెల్లుతుందన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని చేర్యాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు భారతదేశానికి మారెన్నో సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జనగామ నియోజకవర్గం కన్వీనర్ పోతుగంటి రామదాసు, బిజెపి సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి, బిజెపి రూరల్ అధ్యక్షులు కాశెట్టి పాండు, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి షాదుల్లా, పూర్మ సంజీవరెడ్డి, బీసీ మోర్చ పట్టణ అధ్యక్షులు కొట్టే చంద్రమౌళి,ఎస్సీ మోర్చ పట్టణ అధ్యక్షులు సిద్ధులు, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు బిట్ల వెంకటేష్, ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి నర్సింలు, బిజెపి సీనియర్ నాయకులు సిద్ధారెడ్డి, గుడ్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.