వివాదస్పద వాఖ్యలపై మంత్రి టీజీ వివారణ
హైదారబాద్ : ఎప్పుడు వివాదలతో వార్తలో ఉండే మంత్రి టీజీ తాజాగా ఐఏఎస్‌లపై చేసిన వివాదస్పద వాఖ్యలపై తన వివారణ ఇచ్చుకున్నారు. పనిచేయని రాజకీయ నేతలు, అధికారులను కాల్చివేసేలా చట్టసవరణ చేయలని తాను అన్నానని ఆయన చెప్పారు. చిన్న నీటి పారుదలశాఖ పనులు చేయకపోతే తాము ఆత్మహత్యలు చేసుకుంటామన్న రూతుల అవేదనతో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి చెప్పారు. పని చేయని కోడుకు బతికినా ఒకటే ..చచ్చిన ఒక్కటే అని తల్లిదండ్రులు అంటుంటారని…అలాటప్పుడు జీతాలు తీసుకుంటున్నా ఐఏఎస్ అధికారులకు భయం ఎందుకు ఉండదని టీజీ ప్రశ్నించారు. తప్పులు సరిదిద్దుకుంటామని ఎవరైన ఐఏఎస్ అధికారులు ముందుకు వస్తే వారికి క్షమాపణ చెప్పేందుకు తాను సిద్దమని అయన స్పష్టం చేశారు.