వివాహితను వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు
రామడుగు, జనంసాక్షి: మండలంలోని మోతే గ్రామానికి చెందిన వివాహితను ఆరు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్న కైరి శ్రీనివాస్ (27)పై కేసు నమోదు చేయాలని కోరుతూ గ్రామైక్య సంఘాల మహిళలు మండల సమాఖ్యలో ఫిర్యాదు చేశారు. వేధింపులకు గురిచేస్తున్న శ్రీనివాస్‌ను రెండు రోజుల క్రితం వివాహిత బంధువులు మందలించగా అతను గొడ్డలితో దాడికి ప్రయత్నించారు. దీంతో వివాహిత గ్రామంలోని గ్రామైక్యసంఘాలను ఆశ్రయించింది. మంగళవారం గ్రామైక్య సంఘాల మహిళలు మండల సమైక్యలో ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళలందరూ కలిపి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.