వివాహితపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారం
నిర్మల్,సెప్టెంబర్4(జనంసాక్షి): నిర్మల్ జిల్లాలో ఘోర ఘన చోటుచేసుకుంది. వివాహిత ఎత్తుకెళ్లిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి ఉడాయించారు. ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు బాద్యులైన వారిపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ శివారులో భార్యాభర్తలు నివాసముంటున్నారు. భర్త శనివారం పనినిమిత్తం నిర్మల్‌కు వెళ్లాడు. దీంతో ఇదే అదనుగా గమనించిన అదే గ్రామానికి చెందిన దండుగుల ధర్మపురి (20), కుంచెపు గంగాధర్ (20)తో పాటు మరో బాలుడు కలిసి రాత్రి 11 గంటల ప్రాంతంలో బాధితురాలి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆమె నోరు మూసి బలవంతంగా గ్రామ శివారులోకి ఎత్తుకెళ్లారు. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత
ఒకరు అత్యాచారానికి పాల్పడి అక్కడినుంచి పారిపోయారు. ముగ్గురు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.