వివాహ కార్యక్రమానికి హజరైన నారా లోకేశ్
హుజూరాబాద్ గ్రామీణం : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక బీఎన్‌ఆర్ గార్డెన్‌లో తెదేపా నాయకుడు గూడూరు రాంరెడ్డి కుమార్తె వసుమతి వివాహ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంకట తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, నియోజకవర్గ బాధ్యులు ముద్దసాని కశ్యవ్‌రెడ్డి నాయకులు చందా గాంధీ, పుల్లాచారి, అంకుశ్ తదితరులు పాల్గొన్నారు.