వివిధ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు

అసిఫాబాద్‌ : తన నియోజకవర్గంలో పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. కెరమెరి మండలం కరంజివాడ నుంచి లెంజిగూడ గ్రామం వరకు రూ. 1.3కోట్లు , ఈశాని నుంచి సాంగ్వికి రూ. 7.76 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. తిరియాని మండలంలో జడ్పీ రోడ్డు నుంచి నాగుగూడ గ్రామానికి రూ. 2.73 కోట్లు , వాడిగూడ రూ. 1.17 కోట్లు , గూండాల నుంచి దొడ్డిగూడ గ్రామానికి రూ. 3.61 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. మే 16న టెండర్లు పిలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు.