విశాఖల జలదిగ్బంధంలో ప్రజలు

విశాఖపట్టణం : ఎస్‌. రాయవరం మండలం పి. ధర్మవరంలో వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా శనివారం నుంచి ఓ ఇంట్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 9 మంది కుటుంబీకులు ఇప్పటికీ సహాయం అందక విలవిలలాడుతున్నారు. మరోవైపు చోడవరం డీఎస్‌ పేటలో పెద్దేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 200 మంది గ్రామస్తులు వరద నీలిలో చిక్కుకున్నారు. నేవీ బోట్లతో అధికారులు సహాయక చర్యలు చేలట్టారు.