విశాఖ జిల్లాలో కొనసాగుతున్న జగన్ యాత్ర
విశాఖపట్టణం,సెప్టెంబర్6(జనంసాక్షి): విశాఖ జిల్లాలో వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. గురువారంతో ఆయన పాదయాత్ర 256వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన తన పాదయాత్రను పెందుర్తి నియోజకవర్గం చినగొల్లలపాలెం క్రాస్ నుంచి ప్రారంభించారు. అమృతపురం, ఇప్పవానిపాలెం విూదుగా జెర్రిపోతులపాలెం వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తన పాదయాత్రలో భాగంగా ఆయన టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.