విశాఖ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
విశాఖ : జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఉదయం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, కొయ్యూరు. మాడుగులలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు.
.