విశాఖ నుంచి గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ యథాతథం

విశాఖ: విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన గరీభ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఈ రోజు యధావిధిగా నడుస్తాయని తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నేడు ఈ రైళ్లు యాధావిధిగా నడవనున్నట్లు అధికారులు తెలియజేశారు.