విశ్వకర్మ లను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

అఖిల భారత విశ్వకర్మ మహాసభ
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి*
   ఎల్బీనగర్ (జనం సాక్షి ) విశ్వబ్రాహ్మణుల జీవితాలు తెలంగాణలో కడుభారంగా బ్రతకడుస్తున్నారు అని విశ్వబ్రాహ్మణుల విస్మరిస్తున్న ప్రభుత్వాలు అని అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సంకోజు లింగా చారి విమర్శించారు ఈనాడు నానాటికి ఇతర రాష్ట్రాల మార్వాడి కార్పొరేట్ వ్యవస్థ ద్వారా కులవృత్తులు అడుగంటిపోయి జీవితాలలో వెలుగు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అని దుయ్యబట్టారు ఈనాడు అటవీ శాఖ ద్వారా కొత్త కొత్త జీవోలతో తెలంగాణ ప్రభుత్వం మా వడ్రంగుల పాలిటి గొడ్డలి పెట్టుగా వ్యవహరిస్తుంది 69 జీవోతో మా జీవితాలలో అంధకారం మొదలైంది ఇకనైనా ప్రభుత్వం ఆ జీవోను వెనక్కి తీసి మాపై మా జీవితాలపై దయ చూపాలని ప్రభుత్వాన్ని  వేడుకొంటున్నాం మా విశ్వబ్రాబడులు అయినా స్వర్ణకారులు జీవితాలలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడి కార్పొరేట్ వ్యవస్థ ద్వారా వారి బ్రతుకులు ఆగమైపోయినయ్ కొందరు కుటుంబాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రెండు మూడు రోజుల క్రితం వరంగల్ లో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నవి ఇంకా నిజామాబాదు దగ్గర మా స్వర్ణకారుడు జీవితాన్ని మోయలేక ఆకలి పోరాటంతో బ్రతుకు చాలిచ్చిన  మా జీవితాలలో  ఈ తెలంగాణ ప్రభుత్వం లో దుర్భర జీవితాలు ప్రభుత్వానికి పాలకులకు కనబడటం లేదా బంగారు తెలంగాణలో విశ్వకర్మలు దిక్సూచి లాగా పనిచేసిన మేము మా జాతి ఆకలి పోరాటాలతో అన్యాయమైపోతున్న కులవృత్తులతో బ్రతుకు ఈడుస్తున్నాము ఇకనైనా ప్రభుత్వం ఈ ఆకలి చావులను ఆపి వృత్తి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.