విశ్వనగరంగా హైదరాబాద్
తీర్మానంలో మంత్రి కెటిఆర్ ప్రతిపాదన
ఖమ్మం, ఏప్రిల్27(జనంసాక్షి):
దేశంలో అతిపెద్ద నగరంగా ఏనాడో గుర్తింపుపొందిన హైదరాబాద్ ఉమ్మడి పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఆనాడు నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉండేదన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో విశ్వనగరంగా హైదరాబాద్ – రాష్ట్రంలో పట్టణాభివృద్ధి తీర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజల మనస్సులను టీఆర్‌ఎస్ గెలుచుకుంద న్నారు. ఈ తరుణంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గానూ 99 డివిజన్లలో గెలుపొందామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హావిూ మేరకు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ నగరంలో స్థానికేతరులను ఉండనివ్వరని, పెట్టుబడులు తరలిపోతాయని, ఐటీ పరిశ్రమ కుదేలవుతుందని దుష్పచ్రారం చేశారు. కానీ విమర్శకుల నోళ్లు కట్టేస్తూ పెట్టుబడులు అధికంగా వస్తున్నాయన్నారు. అక్కడ స్థానికేతరులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి సంకల్పించామని చెప్పారు. హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం రూ. మిగతా 2లోపేర్కొన్నారు. మూసీ తీరం వెంబడి సిక్స్‌లైన్ స్కైవే నిర్మిస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఇప్పటి వరకు లక్షా 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. గూగుల్, అమెజాన్, ఉబేర్ లాంటి ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ తీర్మానాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ బలపరిచారు. హైదరాబాద్ అభివృద్దికి సిఎం కెసిఆర్ నేతృత్వంలో పసనిచేస్తున్నామని, విశ్వనగరంగా చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని అన్నారు.