విషజ్వరాల వల్ల మంచం పట్టిన పోతారం (ఎస్‌)

హుస్నాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి): మండలంలో పోతారం (ఎస్‌) గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా సుమారు 50 మంది జ్వరాలతో మంచం పట్టినా వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని బొమ్మగాని వీరవ్వ, నడిగొట్టు రాజవ్వ, నడిగొట్టు మహర్జి, నడిగొట్టు సంగీత, సిద్ది సరోజన , నడిగొట్టు శ్రీను , మాతంగి రేష్మ, నామాని కనకలక్ష్మి, కడ శ్రీనివాస్‌, కార్తీక్‌, మణెవ్వ సహా 50 మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. వారం నుంచి విషజ్వరాలతో భాదపడుతున్నా ప్రభుత్వ వైద్య సిబ్బంది. ఇటువైపు కన్నెత్తి చూపిన పాపాన పోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. దీంతో స్థానిక ప్రైవేటు వైద్యుల వద్ద చిరిత్స చేయించుకున్నామని, అయినా జ్వరం తగ్గడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు హన్మకొండ, ఇతర ప్రాంతాల ఆసుపవూతులకు చికిత్సకు వెళ్లగా ప్లేట్‌పూట్లు తగ్గాయని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్య సిబ్బంది స్పందించి గ్రామంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ మాజీ సర్పంచ్‌ బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.