విస్తరిస్తున్న ఒమైక్రాన్ª`తో ఆందోళనలు
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
బెంగళూరు,డిసెబర్17 (జనంసాక్షి): పలు దేశాలలో ’ఒమైక్రాన్’ వేరియంట్ వైరస్ తీవ్రరూపం దాలుస్తున్న తరుణం, రాష్ట్రంలోనూ కేసులు కొనసాగుతున్నందున కొత్త సంవత్సర వేడుకలు వద్దంటూ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ తేల్చింది. డిసెంబరు, జనవరి మా సాలలో ఆర్థిక వ్యవహారాలు, పండుగలు, సంబరాల పేరిట ఎక్కువమంది చేరడం పెను ముప్పుకు సంకేతమేనని టాస్క్‌ఫోర్స్ తేల్చింది. వారం రోజుల వ్యవధిలో టాస్క్‌ఫోర్స్ నాలుగైదుసార్లు భేటీ అయి రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిని సవిూక్షించింది. కొత్త సంవత్సరం వేడుకలకు బ్రేక్ పెట్టాలని సమితి ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.దీంతో రాష్ట్రంలో మరో వారం రోజుల్లో మరిన్ని ఆంక్షలు అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. రెండు విడతల కొవిడ్ పరిణామాలకంటే మూడో విడత మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయస్థాయి వైద్యనిపుణులు సూచిస్తున్న వేళ ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈనెల 22నుంచి జనవరి 2 దాకా కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని తద్వారా క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలకు ప్రజలు గుంపులుగా చేరడాన్ని అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. అయితే కొత్త సంవత్సర వేడుకలు బహిరంగ ప్రదేశాలలో కాకుండా అనుమతులు ఇవ్వాలనే డిమాండ్‌లు లేకపోలేదు. రెండువారాల పాటు సంబరాలను నియంత్రిస్తే ఆ తర్వాత ప్రజలలో చైతన్యం తీసుకురావచ్చునని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలకు బ్రేక్ పెట్టినట్టే అనిపిస్తోంది.