విస్తరిస్తున్న నైరుతి
` తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
` రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఆవర్తనం
` పలు జిల్లాల్లో జోరు వానలు..
` హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
హైదరాబాద్,మే27(జనంసాక్షి):నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి విస్తరించాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. ఈ కారణంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 40-50 కి.విూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో 40 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాబోవు రెండు, మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున పాత భవనాలు, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7.30 గంటలకి వాన ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, టోలిచౌకి, ఫిలింనగర్, మణికొండ, గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, పటాన్ చెరు, ఆర్సీపూరం, బీరంగూడ, సికింద్రాబాద్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఆరాంఘర్, పంజాగుట్ట, చిలకలగూడ, కుత్బుల్లాపూర్, షాపూర్, సూరారం, దుండిగల్, కొండాపూర్, పాటీ-ª`నతో పాటు- పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే, వర్షం నీరు రోడ్డుపై చేరడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అయింది. ఐటీ- సెక్టార్ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రానున్న రెండురోజులు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చిన ఐఎండీ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. కొన్ని చోట్లు- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడిరది. ఉదయం నుంచి ఎండలో అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రానికి కొంత ఉపశమనం కలిగింది. వరంగల్ జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. వరంగల్ సిటీ-, హనుమకొండ తోపాటు- వరంగల్ రూరల్ చుట్టు- పక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నర్సంపేట డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన సాధారణ వర్షం కురిసింది. తొలకరి వర్షాలతో రైతులు వ్యవసాయ పనులు చేపట్టారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరడిగొండ, గడియత్నూర్ బజార్, సిరికొండ మండల్లాలో భారీవర్షం కురిసింది. భారీవర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లి ప్రవహించాయి. రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా వానలు పడ్డాయి. వేముల వాడలలో దాదాపు రెండు గంటలపాటు- వర్షం దంచికొట్టింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. 16 వవార్డు నీటమునిగింది.. దీంతో భక్తులకు చెందిన కారు, ఆటో పూర్తిగా వరదలో చిక్కుకుంది. భారీ వర్షాలతో వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట నక్క వాగు భారీగా వరద నీరు చేరడంతో పొంగిపొర్లుతోంది. ఇక మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, మహబూబాబాద్, కొత్తగూడ మండలాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వాన పడిరది. జగిత్యాల జిల్లాలో కూడా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొడిమ్యాల, కొండగట్టు- పరిసర ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో భారీవర్షం అతలాకుతలం చేసింది. సుమారు రెండు గంటల పాటు- దంచికొట్టింది. దీంతో కొండగట్టు-లో భక్తులు ఇబ్బంది పడ్డారు. కొడిమ్యాల మండల కేంద్రం నుంచి సూరంపేటకు వెళ్లే దారిలో దమ్మాయిపేట స్టేజి వద్దగల పోతారం వాగు పొంగిపొర్లింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. సూరంపేట – గంగారం తండాల మధ్య ఉండే పోతు చెరువు నుండి పెద్ద ఎత్తున నీటి ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతంలో కట్ట మరమ్మత్తు పనులు పూర్తి కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజల ఆందోళన వ్యక్తం చేశారు.