“వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేలు వర్తింపజేయాలి*

డి.ఎస్.పి సంఘీభావం

 రామన్నపేట మండలం గ్రామ రెవెన్యూ సహాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరావధిక సమ్మె 47వ రోజు దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా నాయకులు సంఘీభావం తెలియజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల కోరికలు న్యాయబద్ధమని వారిలో చాలామంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారని తక్షణం వారికి పేస్కేల్ అమలు చేసి అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని 55 సంవత్సరాలు పై పడ్డ వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి పెన్షన్ బెనిఫిట్ కల్పించాలని డీఎస్పీ జిల్లా అధ్యక్షులు నరేందర్ డిమాండ్ చేశారు. 47 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇదేవిధంగా నిర్లక్ష్యం చేసినచో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు  మద్దతు డీఎస్పీ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్ మండల అధ్యక్షులు నరసింహ ప్రధాన కార్యదర్శి నరేందర్  వీఆర్ఏల మండల అధ్యక్షులు వెంకన్న మండల కో కన్వీనర్ దంతాల వెంకన్న ప్రధాన కార్యదర్శి మాదాసి నరసింహ సహాయ కార్యదర్శి రాములు కమిటీ సభ్యులు శంకరయ్య ,లక్ష్మయ్య ,మల్లయ్య, గౌసియా తదితరులు పాల్గొన్నారు.