వీఆర్ఏలు హామీల అమలే లక్ష్యం
డోర్నకల్ ప్రతినిధి అక్టోబర్ 10 (జనం సాక్షి):
రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపుమేరకు నరసింహుల పేట మండల కేంద్రాలలో ఉదయం 10 గంటల నుండి 12గంటల వరకు తాసిల్దార్ కార్యాలయల దిగ్బంధనం చేశారు. తాసిల్దార్ ఆఫీస్ గేటు ముందు వంటి కాలపై నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా సమ్మెను ఉధృతం చేస్తాం పే స్కేల్ జీవో వచ్చే వరకు పోరాటం ఉధృతం అవుతూనే ఉంటుంది అర్హత కలిగిన వారికీ ప్రమోషన్ వారసత్వ ఉద్యోగాలు పే స్కేల్ అమలు జరిగే వరకు పోరాడుతామని అన్నారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏజేఏసీ చైర్మన్ శేఖర్, కో చైర్మన్ ఉప్పలయ్య, లలిత, దివ్య, మల్లయ్య, క్రిష్ణమూర్తి, జనార్ధన్, ఇర్ఫాన్, బిక్షం, వెంకటనారాయణ, వంశీ తదితరులు పాల్గొన్నారు