వీఆర్ఏల భిక్షాటన*

పెద్దేముల్ అక్టోబర్ 11 (జనం సాక్షి )
రాష్ట్రవ్యాప్తంగా 79 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు మంగళవారం పెద్దేముల్ మండల కేంద్రంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భిక్షాటన నిర్వహించారు.ఈ సందర్భంగా విషయంపై వీఆర్ఏల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో గత 79 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా సమ్మెను నీరుగార్చలని చూస్తుందని పేర్కొన్నారు.ఎలాగైనా భయభ్రాంతులకు గురిచేసి సమ్మె విరవింపజేయాలని హేచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దేముల్ మండలంలో భిక్షాటన చేస్తున్నమని తెలిపారు.విషయం తెలుసుకున్న పెద్దేముల్ పోలీసులు వీఆర్ఏలను అరెస్టు చేసి కొద్ది సేపటి తరువాత విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.
Attachments area