వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి,

సిపిఎం నాయకులు,
ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )
 వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు గత 76 రోజులుగా నిరవధిక సమ్మెనిర్వహిస్తున్నారు.శనివారం నాటికి 76రోజు కు చేరుకోవడంతో వీఆర్ఏలకు మద్దతుగా సిపిఎం మండల నాయకులుదీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు  ప్రమోషన్లు, 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల  వారసులకు ఉద్యోగాలు కల్పించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని మాకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపినందుకు వీఆర్ఏ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల సెక్రెటరీ ముంజల సాయిలు, సిపిఎం జిల్లా నాయకులు భూక్య సమ్మయ్య, కుమారస్వామి, నర్సంపేట పట్టణ కార్యదర్శి శ్రీధర్, అశోక్ నగర్ ఉప సర్పంచ్ రాములు, సొసైటీ మాజీ చైర్మన్ అశోక్, సిపిఎం గ్రామ సహాయ కార్యదర్శి రమేష్, వి ఆర్ ఏ జిల్లా అధ్యక్షుడు ఐలేష్, జిల్లా కో కన్వీనర్ మాధవి, మండల ప్రధాన కార్యదర్శి రవికుమార్,వీఆర్ఏలు  సుధాకర్,గోవర్ధన్,సందీప్,నరసయ్య,వీరభద్రం,శ్యామ్, శీను, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.