వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిర్వహిస్తున్న దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు గత 60 రోజులుగా సమ్మెలో పాల్గొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఉండటం సరికాదన్నారు.సీఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.వారికి పే స్కేల్ అమలు చేయాలని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగుల అవకాశాలు కల్పించాలని కోరారు.వీఆర్ఏల
దీక్షకు సిపిఐ జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతుల మల్లేశ్వరి, ఎల్లవుల రాములు, సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి, జిల్లా వీఆర్ఏల సంఘము కో చైర్మన్ మామిడి సైదులు, శ్రీనివాసులు, తండు నగేష్ , సంతోష్ రెడ్డి , నజీర్, శ్రీను, నాగరాజు , రాజ్యలక్ష్మి ,సైదమ్మ , సునీత , చైతన్య , సరిత, శ్రీను, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.