వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ఏడాది బాలుడు
కీసర,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో దారుణం చోటుచేసుకుంది. హనుమాన్‌గనర్‌లో వేణు అనే ఏడాది బాలునిపై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.