వీరప్పన్ భార్య అన్నదానం చేసుకోవచ్చు
– మద్రాస్ హైకోర్టు
చెన్నై అక్టోబర్13(జనంసాక్షి):
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వీరప్పన్ 11వ వర్థంతి సందర్భంగా అన్నదానం కార్యక్రమం జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ముత్తులక్ష్మి పోలీసులను కోరారు. అయితే ఆమె విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు.తన భర్త 2004 అక్టోబర్ 18న జరిపిన ఎన్‌కౌంటర్ లో చనిపోయారని ఆయన జ్ఞాపకార్థం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు సూచించాలని ముత్తులక్ష్మి మద్రాస్ హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ముత్తులక్ష్మి విజ్ఞప్తి ని మన్నించిన ఎంఎం సుందర్ష్ తో కూడిన ధర్మాసనం అన్నదానంకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. అయితే ముత్తులక్ష్మి ఈ అన్నదాన కార్యక్రమంలో ఒంటరిగానే పాల్గొనాలని సూచించింది.